యాస్ వాటర్ వరల్డ్ అబుదాబిలో అగ్నిప్రమాదం..!!

- March 29, 2025 , by Maagulf
యాస్ వాటర్ వరల్డ్ అబుదాబిలో అగ్నిప్రమాదం..!!

యూఏఈ: యాస్ వాటర్ వరల్డ్ అబుదాబిలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదం ధాటికి ఫెరారీ వరల్డ్, యాస్ మెరీనా సర్క్యూట్, విమానాశ్రయం వైపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది.

ఈ సంఘటనపై అధికారులు వేగంగా స్పందించారు. మంటలను అదుపు చేయడానికి యాస్ ద్వీపానికి అత్యవసర బృందాలను పంపినట్లు అబుదాబి పోలీసులు సోషల్ మీడియాలో ధృవీకరించారు. ముందు జాగ్రత్త చర్యగా, అత్యవసర ప్రతిస్పందనదారుల కదలికను సులభతరం చేయడానికి యాస్ బేలో ట్రాఫిక్‌ను దారి మళ్లించిన పోలీసులు.. థీమ్ పార్క్ లోపలికి, బయటికి వెళ్లే మార్గాలను మూసివేశారు.

అయితే,  నిర్మాణంలో ఉన్న విభాగంలో మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. 2013 నుండి పనిచేస్తున్న యాస్ వాటర్ వరల్డ్ ను ఇటీవల పెద్దఎత్తున విస్తరణ చేపడున్నారు. డిసెంబర్‌లో థీమ్ పార్క్ డెవలపర్ అయిన మిరాల్, 18 కొత్త రైడ్‌లు, ఆకర్షణలతో 16,900 చదరపు మీటర్ల విస్తరణను ప్రకటించారు. ఈ విస్తరణలో 3.3 కిలోమీటర్ల స్లయిడ్‌ల నెట్‌వర్క్, యూఏఈలో అత్యంత ఎత్తైన వాటర్‌స్లైడ్ , GCCలో మొట్టమొదటి వాటర్‌పార్క్ రైడ్ కూడా ఉంటాయి, ఇది వాటర్‌స్లైడ్ కాంప్లెక్స్‌లో విలీనం చేయబడింది. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఆ ప్రాంతంలో భద్రతను నిర్ధారించడానికి అత్యవసర బృందాలు సైట్‌లోనే ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com