ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించిన క్రౌన్ ప్రిన్స్..!!

- March 30, 2025 , by Maagulf
ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించిన క్రౌన్ ప్రిన్స్..!!

కువైట్: కువైట్ వ్యాప్తంగా ఈద్ అల్-ఫితర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముస్లిం సోదరులు ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హిస్ హైనెస్ ది క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా కువైట్ నగరంలోని గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. క్రౌన్ ప్రిన్స్ తో పాటు సీనియర్ షేక్ లు, తాత్కాలిక ప్రధాన మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబాతోపాటు సీనియర్ రాష్ట్ర అధికారులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.  ప్రార్థనల అనంతరం ఈద్ ముభారక్ అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com