ఐఎస్ ఐఎస్ అగ్రనేత హతం

- July 12, 2015 , by Maagulf
ఐఎస్ ఐఎస్ అగ్రనేత హతం

ప్రపంచలోని పాశ్చత్య దేశాల వెన్నులో చలిపుట్టించిన ఐఎస్ఐఎస్ అగ్రనేత హఫీజ్ సయూద్‌ఖాన్‌ను అమెరికా సైనికులు మట్టుబెట్టారు. అమెరికా సంకీర్ణ సైన్యం శనివారం నాడు గగన తలం నుంచి జరిపిన కాల్పుల్లో సయూద్‌ఖాన్ మృతిచెందారు. నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని అచిన్‌లో హఫీజ్ స్థావరంపై సంకీర్ణ సేనలు విరుచుకుపడి కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో హఫీజ్‌తో పాటు మరో 30మంది తీవ్రవాదులు మృత్యువాత పడినట్లు ఈమేరకు అఫ్ఘనిస్థాన్ జాతీయ భద్రతా అధికారులు ధృవీకరించారు. కాగా హఫీజ్ అఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ముఖ్యనాయకుడిగా కొనసాగుతున్నట్లు అమెరికా సంకీర్ణ సైన్యం గుర్తించింది. ఇదిలావుండగా ఇటీవల కాలంలో అమెరికా సంకీర్ణ దళాల చేతుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ మరణించిన విషయం విదితమే. బాగ్దాదీ మృతితో కొంతమేర బలహీన పడ్డ ఐఎస్ఎస్‌కు హఫీజ్ నాయకత్వం వహించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సంకీర్ణ సైన్యం సిరియా సరిహద్దుల్లోని అల్‌బాజ్ జిల్లా నైన్‌వేలో కురిపించిన బాంబుల వర్షంలో బాగ్దాదీకి తొలుత గాయాలయ్యాయి. ఆ గాయంతో బాధపడుతూనే బాగ్దాదీ మరణించినట్లు ఇరాన్ రేడియో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా కాగా, పాశ్చాత్య దేశాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్‌కు హఫీజ్, బాగ్దాదీ మరణం పెద్ద దెబ్బగా మారింది. అనేకమందిని పీకలు కోసేసి హతమార్చి, ఆ వీడియోలను సైతం ఆన్‌లైన్లో పోస్ట్ చేసి భయానక వాతావరణాన్ని ఐఎస్ఐఎస్ సృష్టించిన విషయం తెలిసిందే.వీటిలో హఫీజ్ కీలక భూమికపోషించినట్లు అమెరికా సంకీర్ణ సైన్యం వెల్లడించింది. ఇటీవల కాలంలో ఐఎస్ఐఎస్‌లో మహిళలు కూడా చురుకైన పాత్ర పోషించేందుకు సంసిద్ధులవుతున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎస్ఐఎస్ మహిళా ఉగ్రవాదులను మానవ బాంబులుగా ఉపయోగించబోతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్ర పోరాటంలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని ఐఎస్ఐఎస్‌లో మహిళల విభాగం రూపొందుతోందని నిఘా వర్గాలు ఆ దిశగా నిఘా సారిస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com