అసురక్షితమైన సప్లిమెంట్ల జాబితాలో మరో 41 కొత్త ఉత్పత్తులు..!!
- April 03, 2025
యూఏఈ: అసురక్షితమైన సప్లిమెంట్ల జాబితాలో అబుదాబి ఆరోగ్య శాఖ మరో 40 కంటే ఎక్కువ కొత్త ఉత్పత్తులను చేర్చింది. చివరిగా మార్చి 27న అప్డేట్ చేసిన ఉత్పత్తుల జాబితాలో బాడీబిల్డింగ్, లైంగిక మెరుగుదల, బరువు తగ్గింపు, సౌందర్య సాధనాలు లేదా ఏదైనా ఇతర ఆరోగ్య సంబంధిత కారణాల కోసం మార్కెట్ చేయబడిన ఏదైనా కల్తీ లేదా కలుషితమైన సప్లిమెంట్లను చేర్చారు.
ఈ కల్తీ ఉత్పత్తులు మంచి తయారీ పద్ధతులను (GMP) పాటించకుండా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేయబడి నిల్వ చేయబడటం వలన వినియోగదారులకు తీవ్రమైన ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ (DoH) తెలిపింది.
ఈ ఉత్పత్తులలో కొన్ని ఈస్ట్, అచ్చు, బ్యాక్టీరియా లేదా భారీ లోహాలు వంటి జీవసంబంధమైన జాడలతో కలుషితమైనట్లు గుర్తించారు. మరికొన్నింటిలో ప్రకటించని ఔషధ పదార్థంతో కల్తీ చేసినట్లు పరిశోధనల్లో నిర్ధారించారు. దాంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కల్తీ వస్తువుల జాబితాలో బ్రాంజ్ టోన్ బ్లాక్ స్పాట్ కరెక్టర్, బయో క్లైర్ లైటెనింగ్ బాడీ లోషన్, Re5hape hi Morning, Rhino Super Long Lasting 70000, Pink Pussycat, Gluta White Anti-Acne Cream మరికొన్ని ఉన్నాయి. వీటి వినియోగంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.
చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, Dh5,000 నుండి Dh1,000,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. తీవ్ర నేరాలకు Dh100,000 -Dh2,000,000 ఫైన్ తోపాటు జైలు శిక్ష విధిస్తారు. అలాగే చట్టవిరుద్ధ వస్తువులను తప్పనిసరిగా జప్తు చేసి డెస్ట్రాయ్ చేస్తారు. ఉల్లంఘనలు రిపీట్ అయితే రెట్టింపు జరిమానాలు విధించడంతోపాటు ఆయా సంస్థలను ఏడాది పాటు మూసివేయిస్తారు. సురక్షితం కాని ఉత్పత్తుల జాబితాను మంత్రిత్వ శాఖ తన వెబ్ సైట్ లో పెట్టింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!