పిల్లల్లో నులిపురుగుల సమస్యకు
- July 12, 2015
సాధారణంగా చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య చాలా బాధిస్తుంది. ఈ సమస్య వల్ల పిల్లల్లో ఆకలి మందగించడం, నీరసం, చికాకులాంటి సమస్యలెన్నో తలెత్తుతాయి. ఈ బాధను పిల్లలు చెప్పలేక తద్వారా వచ్చే దురదను తట్టుకోలేక చికాకు పెడుతూ ఉంటారు. వీటికి మార్కెట్లో అనేక రకాల ఇంగ్లీషు మెడిసెన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వల్ల తాత్యాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. మనం తినే ఆహారంలో కొన్ని సీజనల్‌గా వచ్చే ఆహారాన్ని తప్పకుండా తీసుకోవడం వల్ల వీటి భాధ నుండి తప్పించుకోవచ్చు. మనం వర్షాకాలంలో వచ్చే చింతచిగురు, మునగాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటి బారినుండి తప్పించుకోవచ్చు. వీటిలో ఉండే సి,డి విటమిన్లు, కొన్ని రకాల ఫ్లేవనాయిడ్స్ మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకండా, మలబద్దకంలాంటి సమస్యలు కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా చింత చిగురు పిల్లల్లో నులిపురుగులను చంపడానికి తోడ్పడుతుంది. చింత పండులో ఉండే ఫ్లేవనాయిడ్స్ కన్నా చింత చిగురులో ఉండే ఫ్లేవనాయిడ్స్, విటమిన్లూ పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా తోడ్పడుతాయి.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







