రంజాన్, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా 222 మంది బెగ్గర్స్ అరెస్ట్..!!

- April 05, 2025 , by Maagulf
రంజాన్, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా 222 మంది బెగ్గర్స్ అరెస్ట్..!!

యూఏఈ: ఎమిరేట్‌లో భిక్షాటన  సంబంధిత మోసపూరిత కార్యకలాపాలను ఎదుర్కోవడానికి నిరంతర ప్రయత్నంలో భాగంగా దుబాయ్ పోలీసులు.. రమదాన్, ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా 222 మంది బెగ్గర్స్ ను అరెస్టు చేసినట్లు అధికార యంత్రాంగం  ప్రకటించింది.

222 మంది యాచకులలో 33 మందిని ప్రత్యేకంగా ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అరెస్టు చేసినట్లు క్రైమ్స్ వింగ్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ తెలిపారు.  పిల్లలతో భిక్షాటన చేస్తున్న పలువురు మహిళలపై కేసులు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు.  

దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్‌లోని “పోలీస్ ఐ” ఫీచర్‌, 901కి కాల్ చేయడం ద్వారా లేదా www.ecrime.aeలోని E-క్రైమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్ బెగ్గింగ్ కేసులను నివేదించడం ద్వారా బెగ్గర్స్ గురించి నివేదించమని ఆయన కమ్యూనిటీ సభ్యులను ప్రోత్సహించారు.

యూఏఈలో భిక్షాటన చేయడం నేరం, దీనికి దిర్హామ్‌లు 5,000 జరిమానాతోపాటు మూడు నెలల జైలు శిక్ష విధించబడుతుంది. బెగ్గర్స్ ముఠాను నిర్వహిస్తున్నట్లు లేదా భిక్షాటన కోసం దేశం వెలుపల నుండి వ్యక్తులను నియమించినట్లు తేలితే ఆరు నెలల జైలు శిక్షతోపాటు  దిర్హామ్‌లు 1,00,000 జరిమానా విధించబడుతుందని, పర్మిట్ లేకుండా నిధులు సేకరించడం చేస్తే దిర్హామ్‌లు 5,00,000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com