వర్క పర్మిట్.. అకాడమిక్ వేరిఫికేషన్..PAM ఆటోమేటెడ్ వ్యవస్థ..!!

- April 06, 2025 , by Maagulf
వర్క పర్మిట్.. అకాడమిక్ వేరిఫికేషన్..PAM ఆటోమేటెడ్ వ్యవస్థ..!!

కువైట్: కువైట్ లో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) కీలకమైన ప్రక్రియను ప్రకటించింది. యజమానుల కోసం ఆశల్ పోర్టల్ లేదా సహెల్ బిజినెస్ యాప్ ద్వారా కార్మిక విభాగాలలో వివిధ రకాల వర్క పర్మిట్ల జారీ, పునరుద్ధరణ, సవరణ కోసం ప్రవాస కార్మికుల అకాడమిక్ వేరిఫికేషన్ కు సంబంధించిన కొత్త విధానాలను అమలు చేస్తోంది.

అధికారిక నివేదికల ప్రకారం..  జారీ, పునరుద్ధరణ లేదా ఏదైనా సవరణ వంటి ఈ ప్రక్రియలలో దేనినైనా సమయంలో విద్యా స్థాయి , అక్రిడిటేషన్ స్థితిని ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ధృవీకరిస్తారు. పని అనుమతి-సంబంధిత దరఖాస్తుతో పాటు యజమాని దానిని అప్‌లోడ్ చేయమని సిస్టమ్ కోరితేనే విద్యా అర్హత అటాచ్‌మెంట్ ధృవీకరించబడుతుంది.

ఇంజనీరింగ్ వృత్తులకు సంబంధించిన సర్టిఫికేసట్లు ఆటోమెటిక్ గా ధృవీకరించబడతాయి. అవసరమైన ఆమోదం లేని దరఖాస్తులు తిరస్కరిస్తారు.కాగా,  పర్మిట్, వర్క్ పర్మిట్ సేవలకు ముందస్తు అనుమతి అవసరమయ్యే ఇంజనీరింగ్ కాని వృత్తుల కోసం, యజమాని దరఖాస్తుకు అటాచ్‌మెంట్‌గా ఆమోదం కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com