గౌతమి శృతిహాసన్‌ల మధ్య విభేదాలు
- July 07, 2016
ఏదైనా ఫంక్షన్స్‌లో పాలు-నీళ్లు మాదిరిగా కలిసిపోయే గౌతమి- శృతిహాసన్‌ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారట. దీంతో వీళ్లిద్దరినీ కన్వీన్స్ చేయలేక 'శభాష్ నాయుడు'కి తలప్రాణం తోకకి వస్తోందని కోలీవుడ్ టాక్. ఇంతకీ అసలేం జరిగింది? కారణమేంటి? బ్రీఫ్‌గా స్టోరీలోకి వెళ్తే...
కమల్‌హాసన్ లేటెస్ట్ మూవీ 'శభాష్‌నాయుడు'. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్గా అమెరికాలో జరిగిన షూట్ డైరెక్టర్ కి హెల్త్ బాగా లేకపోవడంతో ఒకానొక దశలో కమల్ డైరెక్టర్ అవతారమెత్తాడు. సినిమా మాట పక్కనబెడితే.. ఇందులో కమల్‌తో శృతిహాసన్ తొలిసారి స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. ఐతే, ఈ ఫిల్మ్‌కి క్యాస్టూమ్స్ డిజైనర్‌గా నటి గౌతమి వ్యవహరిస్తోంది. కానీ గౌతమి పని పట్ల శృతిహాసన్ అసంతృప్తి వ్యక్తంచేస్తోందని యూనిట్ మాట. గౌతమి సూచించిన క్యాస్టూమ్స్ని శృతి రిజక్ట్ చేసినట్టు టాక్. అంతేకాదు ఆమె పనితనంపై నెగిటివ్ కామెంట్స్ చేసినట్టు కోలీవుడ్ సమాచారం. ఎంతో ప్రొఫెషనల్‌గా హుందాగా వ్యవహరించే శృతిహాసన్ ఇలా రియాక్ట్ కావడంతో యూనిట్ సభ్యులు సైతం ఆశ్చర్యపడిపోతున్నారు. మూవీ మాటేమోగానీ కొన్ని విషయాల్లో ఇద్దర్ని కన్వీన్స్ చేయలేక కమల్‌హాసన్ ఇబ్బందిపడుతున్నట్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి శభాష్ నాయుడు పుణ్యమానికి ఇటు గౌతమి.. అటు శృతిహాసన్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అంటున్నారు. వీటికి ఫుల్స్టాప్ ఎలా పడుతుందో చూడాలి.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









