గౌతమి శృతిహాసన్‌ల మధ్య విభేదాలు

- July 07, 2016 , by Maagulf
గౌతమి శృతిహాసన్‌ల మధ్య విభేదాలు

ఏదైనా ఫంక్షన్స్‌లో పాలు-నీళ్లు మాదిరిగా కలిసిపోయే గౌతమి- శృతిహాసన్‌ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారట. దీంతో వీళ్లిద్దరినీ కన్వీన్స్ చేయలేక 'శభాష్ నాయుడు'కి తలప్రాణం తోకకి వస్తోందని కోలీవుడ్ టాక్. ఇంతకీ అసలేం జరిగింది? కారణమేంటి? బ్రీఫ్‌గా స్టోరీలోకి వెళ్తే...
కమల్‌హాసన్ లేటెస్ట్ మూవీ 'శభాష్‌నాయుడు'. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా అమెరికాలో జరిగిన షూట్ డైరెక్టర్ కి హెల్త్ బాగా లేకపోవడంతో ఒకానొక దశలో కమల్ డైరెక్టర్ అవతారమెత్తాడు. సినిమా మాట పక్కనబెడితే.. ఇందులో కమల్‌తో శృతిహాసన్ తొలిసారి స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. ఐతే, ఈ ఫిల్మ్‌కి క్యాస్టూమ్స్ డిజైనర్‌గా నటి గౌతమి వ్యవహరిస్తోంది. కానీ గౌతమి పని పట్ల శృతిహాసన్ అసంతృప్తి వ్యక్తంచేస్తోందని యూనిట్ మాట. గౌతమి సూచించిన క్యాస్టూమ్స్‌ని శృతి రిజక్ట్ చేసినట్టు టాక్. అంతేకాదు ఆమె పనితనంపై నెగిటివ్ కామెంట్స్ చేసినట్టు కోలీవుడ్ సమాచారం. ఎంతో ప్రొఫెషనల్‌గా హుందాగా వ్యవహరించే శృతిహాసన్ ఇలా రియాక్ట్ కావడంతో యూనిట్ సభ్యులు సైతం ఆశ్చర్యపడిపోతున్నారు. మూవీ మాటేమోగానీ కొన్ని విషయాల్లో ఇద్దర్ని కన్వీన్స్ చేయలేక కమల్‌హాసన్ ఇబ్బందిపడుతున్నట్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి శభాష్ నాయుడు పుణ్యమానికి ఇటు గౌతమి.. అటు శృతిహాసన్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అంటున్నారు. వీటికి ఫుల్‌స్టాప్ ఎలా పడుతుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com