కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు..
- April 08, 2025
న్యూ ఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ప్రకటన విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పని చేస్తున్న వారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు.
1వ తరగతిలో ప్రవేశానికి మార్చి 31 నాటికి విద్యార్థి వయసు 6 నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి. రెండో తరగతికి 7 నుంచి తొమ్మిదేళ్ల మధ్య, మూడు, నాలుగో తరగతులకు 8-10, 5వ తరగతికి 9-11, 6వ తరగతికి 10-12, ఏడవ తరగతికి 11-13, 8వ తరగతికి 12-14, తొమ్మిదికి 13-15, పదో తరగతికి 14-16 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ ఇలా..
ఆన్లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా 1వ తరగతి ప్రవేశాలు..
2 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు.
ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం సీటు కేటాయిస్తారు.
సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థుల ఎంపిక.
9వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష
11వ తరగతి ప్రవేశాలకు సంబంధించి టెన్త్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు.
పదో తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు.
ముఖ్య తేదీలు…
- రెండో ప్రొవిజినల్ జాబితా వెల్లడి: ఏప్రిల్ 04
- మూడో ప్రొవిజినల్ జాబితా వెల్లడి: ఏప్రిల్ 07.
- రెండు, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: జులై 31.
- బాలవాటిక-2, తరగతి 2 నుంచి 12 వరకు (11వ తరగతి మినహాయించి) రిజిస్ట్రేషన్ తేదీలు: ఏప్రిల్ 2 నుంచి 11 వరకు అవకాశం
- బాలవాటిక, తరగతి 2 నుంచి 12 వరకు(11వ తరగతి మినహాయించి) తుది అడ్మిషన్ లిస్ట్: ఏప్రిల్ 17
- అడ్మిషన్లు ప్రారంభం: ఏప్రిల్ 18 నుంచి 21 వరకు
- 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు తుది గడువు: జూన్ 30.
- 11వ తరగతి ప్రవేశాల రిజిస్ట్రేషన్: కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు.
- దరఖాస్తు విధానం: ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా.. రెండు ఆపై తరగతులకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో తరగతికి 40 చొప్పున సీట్లు ఉంటాయి.
- కేంద్రీయ విద్యాలయాల్లో సీబీఎస్ఈ సిలబస్‌లో బోధన.
- పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్య.
- 1వ తరగతి నుంచే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం, శాస్త్ర సాంకేతికపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు.
- మిగిలిన పాఠశాలలకు భిన్నంగా పని వేళలు, సెలవులు.
- ఆటపాటలు, స్వేచ్ఛతో కూడిన విద్య.
ఫీజు వివరాలు..
- అడ్మిషన్ పొందే విద్యార్థులు రూ.25 ప్రవేశ రుసుం చెల్లించాలి.
- ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థి వరకు నెలకు రూ.500 చెల్లించాలి.
- 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్యూటర్ బోధన కోసం అదనంగా నెలకు రూ.100 చెల్లించాలి.
- 9వ, 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.200 చెల్లించాలి.
- 11,12వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.400 చెల్లించాలి.
తాజా వార్తలు
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్‌పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!