ఈ నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే నిద్రలేమి దూరం...!

- April 10, 2025 , by Maagulf
ఈ నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే నిద్రలేమి దూరం...!

రాత్రంతా హాయిగా పడుకుంటే దాని వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అదే నిద్ర సరిగా లేకపోతే రోజంతా అలసట, నీరసంగా ఉండడమే కాకుండా జీర్ణ సమస్యలు మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి. అందుకే, నిద్రలేమిని దూరం చేసుకునేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందులో ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి.

రాత్రుళ్లు పడుకునే ముందు అరికాళ్లకి ఆవనూనెని రాయడం వల్ల లాబాలున్నాయని చెబుతున్నారు. దీని వల్ల రక్తప్రసరణ సరిగా జరిగి పీరియడ్స్ నొప్పి తగ్గడం నుంచి మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుంది. వీటితో పాటు ఆవనూనె జీర్ణక్రియ, నిద్రలేమి సమస్యల్ని తగ్గిస్తుంది.

ఆవనూనెతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల మనసు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఈ మసాజ్ వల్ల వాపు తగ్గుతుంది. శ్వాస తీసుకోవడంలో ఉపశమనం కలుగుతుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది. ఈ మసాజ్ చేయడం వల్ల నేరుగా జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది. 

ఆవనూనెతో అరికాళ్లని మసాజ్ చేస్తే అజీర్నం, నిద్రలేమి నుంచి కచ్చితంగా ఉపశమనం ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీనినే ఫాలో అవుతారు. నిపుణుల ప్రకారం, ఈ మసాజ్ వాయు మార్గాలని సడలిస్తుంది.ఇవి శ్వాసకోశ వ్యవస్థలో భాగమైన ప్రత్యేక గొట్టాలు. ఈ గొట్టాలు శ్వాసనాళం నుండి ఊపిరితిత్తులకి గాలిని తీసుకెళ్తాయి. ఈ వాయు మార్గాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు నిద్ర నాణ్యత మెరుగ్గా మారుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com