తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్..
- April 10, 2025
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, వర్షాలు పడినప్పటికీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతుండడంతోపాటు.. క్యూమిలోనింబస్ మేఘాల వల్ల తెలంగాణలో గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షంతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది.
గురువారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
హైదరాబాద్ లోనూ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో సాధారణంకంటే 2 నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







