యూఏఈలో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం

- April 10, 2025 , by Maagulf
యూఏఈలో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం

అజ్మన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,శ్రీ రామనవమిని పురస్కరించుకొని ఏప్రిల్ 6, ఆదివారం రోజున అజ్మన్ నగరంలో జగద్రక్షుడైన సీతా సమేత శ్రీరాముల వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.అజ్మన్ లోని జైనం జీవికా ఫార్మ్ హౌస్‌లో ఆదివారం ఉదయం 9:30 గంటలకు కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో దాదాపుగా 3000 మంది హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని వంశీ గౌడ్, నవనీత్ రాజా, శరత్ గౌడ్, కృష్ణ, మదన్, జగదీష్, రమేష్, సాయి, రాజు, గోవర్ధన్, అజయ్ మరియు అశోక్‌లు విజయవంతం చేసారు.కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకార్యానికి గురి కాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. కల్యాణ మోహోత్సవం తర్వాత భక్తులకు అన్నదానం నిర్వహించారు.మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com