SR69తో అబ్షర్ ద్వారా ప్రవాసుల పాస్‌పోర్ట్ అప్డేట్..!!
- April 11, 2025
రియాద్: ప్రవాసుల పాస్‌పోర్ట్ సమాచారాన్ని ఇప్పుడు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) కార్యాలయాలను వ్యక్తిగతంగా సంప్రదించకుండానే.. అబ్షర్ ప్లాట్‌ఫామ్ ద్వారా వారి యజమానుల ఖాతా ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ సేవను పొందేందుకు VATతో సహా SR69 సేవా ఛార్జీ ఉంటుంది. పాస్‌పోర్ట్‌లను పునరుద్ధరించిన తర్వాత 18 సంవత్సరాలు పైబడిన వలసదారులకు అబ్షర్ ప్లాట్‌ఫామ్ ఈ సేవలను అందిస్తుంది.
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక కార్మికుడికి పాస్‌పోర్ట్ సమాచారం అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే నివాసికి మరొక పాస్‌పోర్ట్ ఉంటే, సేవ నుండి ప్రయోజనం పొందడానికి జవాజత్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సంప్రదించాలని వెల్లడించారు. మునుపటి పాస్‌పోర్ట్ పోయినట్లయితే, అప్డేట్ కోసం జవాజత్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!