చికెన్ షిప్‌మెంట్‌లో 46.8 కిలోల కొకైన్‌..అడ్డుకున్న కస్టమ్స్..!!

- April 12, 2025 , by Maagulf
చికెన్ షిప్‌మెంట్‌లో 46.8 కిలోల కొకైన్‌..అడ్డుకున్న కస్టమ్స్..!!

జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ ద్వారా రాజ్యంలోకి 46.8 కిలోగ్రాముల కొకైన్‌ను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అడ్డుకుంది. చికెన్ షిప్‌మెంట్ కూలింగ్ యూనిట్‌లో కొకైన్ ను దాచారని అధికారులు తెలిపారు. అధునాతన భద్రతా స్క్రీనింగ్, ప్రత్యక్ష తనిఖీలను ఉపయోగించి కస్టమ్స్ విధానాల సమయంలో కొకైన్ ను గుర్తించినట్లు పేర్కొన్నారు.  ఏదైనా అనుమానిత స్మగ్లింగ్ కార్యకలాపాలను 1910 వద్ద ఉన్న రహస్య హాట్‌లైన్, [email protected] వద్ద ఇమెయిల్ లేదా 009661910 అంతర్జాతీయ నంబర్ ద్వారా నివేదించాలని కూడా అథారిటీ ప్రజలను కోరింది. సరైన సమాచారం అందించిన వారికి ఆర్థిక బహుమతులను అందిస్తామని వెల్లడించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com