యూఏఈలో 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు..!!

- April 12, 2025 , by Maagulf
యూఏఈలో 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు..!!

యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీవులు,  తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) తెలిపింది. అబుదాబిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42°C, కనిష్టంగా 25°C ఉండే అవకాశం ఉందన్నారు. దుబాయ్‌లో ఉష్ణోగ్రతలు 40°C, కనిష్టంగా 24°C ఉంటుందన్నారు.  

సాధారణంగా,  వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు. కొన్నిసార్లు పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చని తెలిపారు. ఆగ్నేయం నుండి ఈశాన్య దిశ వరకు గాలులు తేలికగా వీస్తాయని, కొన్నిసార్లు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com