ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- March 02, 2026
వాషింగ్టన్: ఇరాన్ పై సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లాబీయింగ్ చేశారనే వాదనలను సౌదీ అరేబియా ఖండించింది. టెహ్రాన్‌తో విశ్వసనీయ ఒప్పందాన్ని కుదుర్చుకునే లక్ష్యంతో జరిగిన దౌత్య ప్రయత్నాలకు సౌదీ మద్దతు ఇచ్చిందని వాషింగ్టన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ప్రతినిధి ఫహద్ నజర్ గుర్తు చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య పరిష్కారాలకు సౌదీ మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ మేరకు నజర్ సోషల్ మీడియాలో ఒక ప్రకటనను పోస్ట్ చేశారు.
అంతకుముందు వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియాలకు చెందిన ప్రతినిధులు వారాల తరబడి లాబీయింగ్ చేసిన తర్వాత అమెరికా నిఘా వర్గాలు వద్దంటున్న అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించారని పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







