'కాట్రు వెలియిదై' చిత్ర ఫస్ట్‌లుక్
- July 07, 2016
కార్తీ, అదితిరావ్ హైదరి జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'కాట్రు వెలియిదై' చిత్ర ఫస్ట్‌లుక్ గురువారం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. కథానాయకి అదితిరావ్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం కోసం తమిళం నేర్చుకుంటున్నట్లు అదితిరావ్ ట్వీట్ చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రవివర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అదితిరావ్ 'శ్రీరంగం' చిత్రంతో తమిళంలో తెరంగేట్రం చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









