రెసిడెన్సీ వెలుపల ల్యాండ్‌స్కేపింగ్..అనుమతి తప్పనిసరి..!!

- April 13, 2025 , by Maagulf
రెసిడెన్సీ వెలుపల ల్యాండ్‌స్కేపింగ్..అనుమతి తప్పనిసరి..!!

మస్కట్: మస్కట్ గవర్నరేట్ లో రెసిడెన్సీ వెలుపల ల్యాండ్‌స్కేపింగ్‌ చేయాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఇందు కోసం ‘మైనర్ బిల్డింగ్ పర్మిట్ జారీ’ని ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. హౌసింగ్, అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ ఆమోదించిన ప్రణాళికల ప్రకారం.. పుట్ పాత్, సర్వీస్ కారిడార్‌లను కనీసం 3 మీటర్ల వెడల్పుతో వదిలివేయడం తప్పనిసరి చేశారు.  నివాస భవనం మొత్తం ల్యాండ్‌స్కేపింగ్ ప్రాజెక్ట్ పరిధిలో ఉంటే, ప్రాజెక్ట్ నిర్వహణ లేదా పర్యవేక్షక సంస్థ నుండి ఆమోదం పొందాలి.

పాదచారులు, సైకిల్ మార్గాలు, వీల్‌చైర్‌ల కారిడార్‌గా కనీసం 1.5 మీటర్లతో ప్రత్యేకంగా ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది.  ఇంటికి రోడ్డుకు మధ్య కనీసం 3 మీటర్లు ఉండాలి. 6 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ అందుబాటులో ఉంటే, ల్యాండ్‌స్కేపింగ్ ప్రాంతం 4 మీటర్లు మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి.   

అయితే, కార్ ప్రవేశాలు, రైల్వేలు లేదా పబ్లిక్ యుటిలిటీల సమీపంలోని ప్రాంతాలు, పబ్లిక్ సర్వీసెస్ మార్గాలు లేదా విద్యుత్ కాంప్లెక్స్‌లకు దగ్గరగా, రెండు పొరుగు భూముల మధ్య ప్రాంతాలలో గ్రీనరీని పెంచడాన్ని నిషేధించారు.  చెట్లకు కంచె వేయడానికి స్థిరమైన పదార్థాలను ఉపయోగించడం, ఇంటర్‌లాకింగ్ టైల్స్ (ఇంటర్‌లాక్) లేదా 20 సెంటీమీటర్ల ఎత్తుకు మించని కార్బ్‌స్టోన్ లేదా ఇలాంటి పదార్థాలతో చేసిన సైడ్ బారియర్‌లను నిషేధించారు. 50 సెంటీమీటర్లకు మించకుండా మొక్కల కంచె లేదా ప్రతి చెట్టుకు 1.5 మీటర్లకు మించకుండా మెటల్ మెష్ కంచె ఏర్పాటు చేయవచ్చు. పర్మిట్ పొందడానికి, దరఖాస్తును మస్కట్ మునిసిపాలిటీ వెబ్‌సైట్ www.mm.gov.om ద్వారా లేదా సనద్ సర్వీసెస్ కార్యాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ల్యాండ్‌స్కేపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి OMR100 పరిపాలనా జరిమానా, రోజువారీ OMR10 జరిమానా (గరిష్టంగా OMR200 వరకు), ల్యాండ్‌స్కేపింగ్‌ను తొలగించాల్సి ఉంటుంది.  మరింత సమాచారం, దరఖాస్తుల కోసం, మస్కట్ మునిసిపాలిటీ అధికారిక వెబ్‌సైట్‌ను (www.mm.gov.om) సందర్శించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com