ICAO భద్రతా ఆడిట్‌.. కువైట్ విమానాశ్రయానికి అత్యధిక స్కోరు..!!

- April 13, 2025 , by Maagulf
ICAO భద్రతా ఆడిట్‌.. కువైట్ విమానాశ్రయానికి అత్యధిక స్కోరు..!!

కువైట్: అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలను అధిగమించి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా ఆడిట్‌లో ఉత్తీర్ణత సాధించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది. విమానయాన భద్రతను బలోపేతం చేయడంలో మద్దతు, నిబద్ధతను ఈ విజయం ప్రతిబింబిస్తుందని DGCA డైరెక్టర్ జనరల్ షేక్ హుమౌద్ అల్-సబా పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆడిట్ బృందం విమానాశ్రయ సౌకర్యాలను సమగ్రంగా సమీక్షించిందని ఆయన అన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com