మక్కాలోని హాస్పిటాలిటీ సంస్థలకు పర్యాటక మంత్రిత్వ శాఖ కీలక సర్క్యులర్..!!

- April 14, 2025 , by Maagulf
మక్కాలోని హాస్పిటాలిటీ సంస్థలకు పర్యాటక మంత్రిత్వ శాఖ కీలక సర్క్యులర్..!!

రియాద్: హజ్ సీజన్‌లో హజ్ పర్మిట్ లేదా నగరంలో పని చేయడానికి లేదా బస చేయడానికి అధికారిక ప్రవేశ అనుమతి లేని వారికి వసతి కల్పించవద్దని పర్యాటక మంత్రిత్వ శాఖ మక్కాలోని అన్ని హాస్పిటాలిటీ సంస్థలను ఆదేశించింది. ఈ ఆదేశం 2025 ఏప్రిల్ 29కి అనుగుణంగా ధుల్ ఖాదా 1, 1446 నుండి అమలులోకి వస్తుందని, హజ్ సీజన్ ముగిసే వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సురక్షితంగా, శాంతియుతంగా హజ్ యాత్రను నిర్వహించగలరని నిర్ధారించడం లక్ష్యంగా ఏర్పాట్లు, విధానాలకు సంబంధించి అంతర్గత మంత్రిత్వ శాఖ ఇటీవల చేసిన సూచనతో ఈ మేరకు ప్రకటించారు. ఏప్రిల్ 29నాటికి, హజ్ వీసా కాకుండా వేరే ఏ రకమైన వీసా కలిగి ఉన్న వ్యక్తులు మక్కాలో ప్రవేశించడానికి లేదా ఉండటానికి అనుమతించబడరని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com