ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల..
- April 23, 2025
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యటకులే. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబుతాలాగా గుర్తించారు.
ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను స్కెచ్ వేశారు. వీరందరూ జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లో సభ్యులు. అయితే, ఈ ఉగ్రదాడికి ఇప్పటికే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది. ఉగ్రవాదుల కోసం సైన్యం ఆపరేషన్ చేపట్టింది. ముష్కరులు బాడీ కెమెరాలతో దాడిని చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీటిని హెల్మెంట్లకు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొలుత బాధితులు అందరినీ ఒకచోటుకు చేర్చి వారి గుర్తింపులను తనిఖీ చేశారు. ఆ తరువాత చంపేశారు. కొందరిని పారిపోతుండగా కాల్చేశారు.
తాజా వార్తలు
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!







