ఒమన్ $565 మిలియన్లతో సౌర తయారీ ప్లాంట్..!
- April 29, 2025
మస్కట్: సోహార్ ఫ్రీజోన్‌లో అత్యాధునిక సౌర తయారీ కర్మాగారాన్ని స్థాపించడానికి $565 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఒమన్ తన పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించే దిశగా ఒక పెద్ద అడుగు వేసింది. మస్కట్‌లో జరిగిన అడ్వాంటేజ్ ఒమన్ ఫోరం సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఒమన్ విజన్ 2040 కింద క్లీన్ ఎనర్జీ, పారిశ్రామిక వైవిధ్యీకరణకు సుల్తానేట్ నిబద్ధతను తెలియజేశారు.
ప్రపంచంలోని టాప్ నాలుగు అధిక సామర్థ్యం గల సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీదారులు , సరఫరాదారులలో ఒకటైన JA సోలార్ ఎనర్జీ, ఇన్వెస్ట్ ఒమన్, సోహార్ పోర్ట్ , ఫ్రీజోన్, మాజిస్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ వంటి కీలకమైన ఒమానీ సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఇది 6 గిగావాట్ల సోలార్ సెల్స్, 3 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది యూరప్, యునైటెడ్ స్టేట్స్, ఈ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్లకు సేవలు అందిస్తుందని వాణిజ్యం, పరిశ్రమ, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఇబ్టిసామ్ అల్ ఫరూజీ తెలిపారు. దీని ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఒమన్ క్లీన్ ఎనర్జీ పాలసీని ముందుకు తీసుకెళ్లడంలో నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







