హోటళ్లలో చెక్-ఇన్ కోసం ఫేస్-రికగ్నిషన్ టెక్నాలజీ.. అబుదాబిలో అమలు..!!
- April 29, 2025
యూఏఈ: సందర్శకులు, నివాసితులు, ఉద్యోగుల భద్రత కోసం అబుదాబిలోని అన్ని హోటళ్లలో ఫేస్-రికగ్నిషన్ టెక్నాలజీని అమలు చేయనున్నారు. ఫేస్-రికగ్నిషన్ వ్యవస్థ గెస్టులు, సందర్శకుల చెక్-ఇన్ సమయంలో బయోమెట్రిక్ డేటాను తీసుకుంటుందని, అనంతరం దానిని విశ్లేషిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు. డేటా సురక్షితంగా ఎన్‌క్రిప్ట్ చేయబడుతుందని, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) ద్వారా మ్యాచ్ చేసి, దానిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం - అబుదాబి నిర్వహించే కేంద్రీకృత డేటాబేస్‌కు కనెక్ట్ చేస్తుందన్నారు.
యూఏఈ సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యతా నిబంధనలకు అనుగుణంగా, చట్టపరమైన, నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. అతిథుల భద్రతను మెరుగుపరచడాని, హోటల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ డేటా ప్రత్యేకంగా ఉపయోగించబడుతుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ఇప్పుడు ఎమిరేట్‌లోని కొన్ని ఎంపిక చేసిన హోటళ్లలో పైలట్ దశలో విజయవంతంగా అమలు అవుతుందన్నారు. పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే మొదటి దశలో భాగంగా అబుదాబి నగరంలోని ఫైవ్ స్టార్స్ హోటళ్లు, అల్ ఐన్ ప్రాంతం, అల్ దఫ్రా ప్రాంతంలో ప్రారంభమవుతుందని తెలిపారు. తరువాత రెండవ దశ ఫోర్ స్టార్స్ హోటళ్లలో..క్రమంగా మిగిలిన అన్ని హోటల్స్ కు విస్తరిస్తామన్నారు.
యూఏఈ రాజధానిలోని హోటళ్ళు Dh2.3 బిలియన్ ($626 మిలియన్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 18 శాతం పెరుగుదల నమోదైంది. మరియు అందుబాటులో ఉన్న గదికి ఆదాయం (RevPAR) Dh484 కు చేరుకుంది, ఇది సంవత్సరానికి 25 శాతం పెరుగుదల అని పేర్కొన్నారు. ఈ కాలంలో హోటల్ ఆక్యుపెన్సీ అధిక స్థాయిలను కొనసాగించిందని, రమదాన్ తో సహా, ఎమిరేట్ అంతటా 79 శాతం నమోదు చేసిందన్నారు. పర్యాటక రంగం 2025లో ఆర్థిక వ్యవస్థకు Dh62 బిలియన్లను అందించనుందని, ఇది 2024 నుండి 13 శాతం పెరుగుదల కాగా, 2025లో ఎమిరేట్ అంతటా 255,000 ఉద్యోగాలకు మద్దతు ఇస్తుందని తెలిపారు.
నంబియో భద్రతా సూచిక ద్వారా అబుదాబి ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ర్యాంక్ పొందిందని DCT అబుదాబిలో పర్యాటక డైరెక్టర్ జనరల్ సలేహ్ మొహమ్మద్ అల్ గెజిరీ వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







