కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- April 30, 2025
కోల్‌కతా: కోల్‌కతాలో విషాదం చోటు చేసుకుంది. బారా బజార్ ప్రాంతంలోని మచ్చువా ఫాల్ మండి సమీపంలో రితురాజ్ హోటల్ లో మంగళవారం రాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 14మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ అగ్నిప్రమాదం గురించి మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి 8.15గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించిందని చెప్పారు. ఈ ప్రమాదం నుంచి ఇప్పటి వరకు 14మంది మృతిచెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మంటలు ఎలా సంభవించాయనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. అయితే, హోటల్ లో మంటలు పెద్దెత్తున వ్యాపించడంతో ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు భవనంపై నుంచి దూకేశారు. ఆ సమయంలో అగ్నిమాపక బృందం అక్కడికి చేరుకొని పలువురి ప్రాణాలను కాపాడారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







