జిద్ హాఫ్స్ మార్కెట్ తొలగింపులు నిలిపివేత..!!
- May 01, 2025
మనామా: జిద్ హాఫ్స్ మార్కెట్లోని విక్రేతలపై తొలగింపు ఉత్తర్వులను నిలిపివేయాలని అత్యవసర పార్లమెంటరీ ప్రతిపాదన కోరింది. వ్యాపారులను సంప్రదించి సమీపంలోని ప్రత్యామ్నాయాన్ని పొందే వరకు తొలగింపులను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. విక్రేతలతో చర్చలు జరిగే వర, కొత్త స్థలాన్ని ఏర్పాటు చేసే వరకు స్టాళ్లను తొలగించడాన్ని నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఎంపీలు మహమూద్ ఫర్దాన్, హమద్ అల్ డోయ్, మమ్దౌ అల్ సలేహ్, మొహమ్మద్ అల్ రిఫాయ్, హిషామ్ అల్ అవధి కోరారు. మెరుగైన ప్రత్యామ్నాయం లేకుండా బలవంతంగా తొలగింపులు చాలా మందిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడేస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే అక్కడినుంచి విక్రేతలను బలవంతంగా తొలగించడం ప్రారంభించారని సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ల నేపథ్యంలో ఎంపీలు ఈ మేరకు ప్రతిపాదనను తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







