ఖతార్ లో మొట్టమొదటి ప్రీ-ఓన్డ్ బోట్ షో..!!
- May 01, 2025
దోహా, ఖతార్: ఓల్డ్ దోహా పోర్ట్ ఖతార్ మొట్టమొదటి మినా ప్రీ-ఓన్డ్ బోట్ షోకు సిద్ధమైంది. మే 5 నుండి 7 వరకు జరిగే ఈ ప్రదర్శన.. మొదటిసారిగా సముద్ర ఔత్సాహికులు, కొనుగోలుదారులు-అనుభవజ్ఞులైన బోటర్లను ఒకచోట చేర్చనుంది. జెట్ స్కీలు, ఫిషింగ్ బోట్ల నుండి యాచ్‌లు, సూపర్యాచ్లు , సాంప్రదాయ ధోవ్ల వరకు ప్రీ-ఓన్డ్ వాటర్క్రాఫ్ట్ల క్యూరేటెడ్ ఎంపికలను అందించనుంది.
ఖతార్ సముద్ర కమ్యూనిటీకి మద్దతు ఇవ్వడానికి ఓల్డ్ దోహా పోర్ట్ పడవ యజమానులకు వారి నౌకలను ఉచితంగా ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తోంది. సందర్శకులందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
ఆన్-సైట్ నిర్వహణ వర్క్‌షాప్‌లు, తనిఖీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. తమ ప్రీ-ఓన్డ్ ఓడలను ప్రదర్శించడానికి ఆసక్తి ఉన్న పడవ యజమానులు, మెరైన్ కంపెనీలు +974 5567 7614 కు కాల్ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలని ఓల్డ్ దోహా పోర్ట్ సీఈఓ ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా సూచించారు. మినా ప్రీ-ఓన్డ్ బోట్ షో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







