TCSS ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం

- May 01, 2025 , by Maagulf
TCSS ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు మరియు శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ కి తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సొసైటీ  ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల,పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా,  భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com