ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- October 12, 2025
న్యూ ఢిల్లీ: బల్ స్టార్ రామ్ చరణ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) చైర్మన్ అనిల్ కామినేని, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు విరేందర్ సచ్దేవా కలిసి ఈ రోజు న్యూఢిల్లీలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ భేటీ సందర్భంగా, APL తొలి సీజన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, ప్రతినిధులు ప్రధాన మంత్రికి ఒక సింబాలిక్ బౌ ని అందజేశారు.
అనిల్ కామినేని నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ భారతీయ ప్రాచీన క్రీడ అయిన విలువిద్యను (Archery) తిరిగి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చే లక్ష్యంతో సాగుతోంది. ప్రపంచ స్థాయి శిక్షణ, పోటీ వేదికలు, అంతర్జాతీయ గుర్తింపు ..ఈ మూడు మార్గాల ద్వారా భారత విలువిద్యాకారులకు అవకాశాలను అందించడం APL ప్రధాన లక్ష్యం.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. మన ప్రధాన మంత్రిని కలవడం ఎంతో గౌరవంగా అనిపించింది.ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వెనుక ఉన్న విజన్‌ను పంచుకోవడం గర్వంగా ఉంది. విలువిద్య మన సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం. APL ద్వారా దీన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలన్నది మా ఆశయం. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది, ఈ వేదిక వాళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.
ఈ భేటీకి రామ్ చరణ్‌తో పాటు ఆయన భార్య ఉపాసన కామినేని కొనిదెల కూడా హాజరయ్యారు. ఆమె రామ్ చరణ్ తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ తరఫున ప్రధాన మంత్రికి బాలాజీ విగ్రహం, సంప్రదాయ పూజా కిట్ ని బహూకరించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







