అయోధ్య రామాలయంలో బంగారు కలశం ఏర్పాట్లు

- May 02, 2025 , by Maagulf
అయోధ్య రామాలయంలో బంగారు కలశం ఏర్పాట్లు

అయోధ్య: అయోధ్యలో నిర్మాణంలో ఉన్న భవ్య రామాలయ శిఖరంపై బంగారు తాపడం చేసిన కలశాన్ని త్వరలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కలశం 20 గేజ్ రాగి షీటుతో తయారుచేసి, దానిపై బంగారు పూత వేయబడుతోంది. రామ భక్తులు కోరుకున్నట్లుగానే, ఆలయ శిఖరంపై ఈ బంగారు కలశాన్ని ప్రతిష్ఠించబోతున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. భక్తుల కల త్వరలోనే నెరవేరబోతోందని ఆయన ప్రకటించారు.ఇక రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ మొదటి అంతస్తులో రామ దర్బార్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇందులో బంగారు తలుపును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వివరాలను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

రామ దర్బార్‌లో ఉన్న విగ్రహాలు ఈ నెలలో రావచ్చని ఆయన చెప్పారు. రామ మందిరంలో నిర్మించబోయే ఏడు మండపాల పనులు త్వరలో పూర్తయ్యే అవకాశముంది.అలాగే ఆలయ ప్రాంగణంలోని ఇతర నిర్మాణాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఈశాన్య భాగంలో శివాలయం నిర్మాణం జరుగుతుండగా, నైరుతి దిశలో రామ మందిర సంబంధిత నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రాకార నిర్మాణం సహా ఇతర భాగాల్లో పనులు తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు తిలకించదగ్గ స్థలంగా అయోధ్య రామాలయం రూపుదిద్దుకుంటుండడం రామ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com