అయోధ్య రామాలయంలో బంగారు కలశం ఏర్పాట్లు
- May 02, 2025
అయోధ్య: అయోధ్యలో నిర్మాణంలో ఉన్న భవ్య రామాలయ శిఖరంపై బంగారు తాపడం చేసిన కలశాన్ని త్వరలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కలశం 20 గేజ్ రాగి షీటుతో తయారుచేసి, దానిపై బంగారు పూత వేయబడుతోంది. రామ భక్తులు కోరుకున్నట్లుగానే, ఆలయ శిఖరంపై ఈ బంగారు కలశాన్ని ప్రతిష్ఠించబోతున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. భక్తుల కల త్వరలోనే నెరవేరబోతోందని ఆయన ప్రకటించారు.ఇక రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ మొదటి అంతస్తులో రామ దర్బార్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇందులో బంగారు తలుపును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వివరాలను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
రామ దర్బార్లో ఉన్న విగ్రహాలు ఈ నెలలో రావచ్చని ఆయన చెప్పారు. రామ మందిరంలో నిర్మించబోయే ఏడు మండపాల పనులు త్వరలో పూర్తయ్యే అవకాశముంది.అలాగే ఆలయ ప్రాంగణంలోని ఇతర నిర్మాణాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఈశాన్య భాగంలో శివాలయం నిర్మాణం జరుగుతుండగా, నైరుతి దిశలో రామ మందిర సంబంధిత నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రాకార నిర్మాణం సహా ఇతర భాగాల్లో పనులు తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు తిలకించదగ్గ స్థలంగా అయోధ్య రామాలయం రూపుదిద్దుకుంటుండడం రామ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!