కశ్మీర్ లోయలో శనివారం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు
- July 08, 2016
కశ్మీర్ లోయలో శనివారం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్ లోయలో పలు ప్రాంతాల్లో ఈ రోజు ఆంక్షలు విధించారు. శుక్రవారం భద్రత దళాలు అనంతనాగ్ లో మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బర్హణ్ వనీతో పాటు మరో ఇద్దరిని కాల్చిచంపారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రలను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. సంఘ విద్రోహశక్తులు వదంతులు ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేశారు.పుల్వామా జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆంక్షలు విధించారు. అనంతనాగ్, షోపియన్, పుల్గాం, సొపొరె పట్టణాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. శ్రీనగర్ లో ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఈ రోజు జరగాల్సిన స్కూలు బోర్డ్ పరీక్షలన్నింటినీ వాయిదా వేశారు. కశ్మీర్ ప్రాంతంలోని బారాముల్లా నుంచి జమ్ములోని బనిహాల్ కు వెళ్లే రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







