'వేవ్స్ 2025' లో నాగపూర్‌లో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్

- May 03, 2025 , by Maagulf
\'వేవ్స్ 2025\' లో నాగపూర్‌లో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్

ప్రపంచంలోనే  బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ తో నాగపూర్‌లో మొదటిసారిగా నిర్మించబోయే ఈ సినిమా థియేటర్ భారతీయ సాంకేతిక రంగానికి ఒక మార్గదర్శకంగా నిలవనుంది. ఎంటర్ టైన్మెంట్ లో మోడరన్ ఇండియాకి ఇది ఒక గర్వకారణంగా మారబోతోంది.

"వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ నిర్మించేందుకు అవకాశం దక్కడం నాకు గర్వకారణం. ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లాలని ప్రధాని గారి లక్ష్యం. అదే ప్రేరణగా ఈ ప్రయత్నం మొదలైంది. మా విజన్ ని అర్థం చేసుకుని ఈ కలను నిజం చేసేందుకు మమ్మల్ని నమ్మిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు," అని అభిషేక్ అగర్వాల్ అన్నారు.

"సినిమాను మరింత గొప్పగా మార్చడమే మా UV క్రియేషన్స్ లక్ష్యం. గొప్ప సినిమాలు తీయడమే కాదు, అద్భుతమైన థియేటర్లు కూడా నిర్మించడమే మా ధ్యేయం. ప్రపంచపు అతిపెద్ద స్క్రీన్‌ని నాగపూర్‌లో నిర్మించబోతున్నాము. మా పరిశ్రమ సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీ గారికి మా కృతజ్ఞతలు" అని విక్రమ్ రెడ్డి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com