ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి..
- May 04, 2025
ముంబై: తాజాగా జరిగిన 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి అవార్డు అందుకున్నారు.రజాకార్ సినిమాలోని తన విజువల్స్‌తో అందరినీ మెప్పించాడు ఈ సినిమాటోగ్రఫర్. రజాకార్ సినిమాకు తన కెమెరా వర్క్ కి గాను ఈ అవార్డు అందుకున్నారు.
కుశేందర్ రమేష్ రెడ్డి కేకే సెంథిల్ కుమార్ దగ్గర ఈగ, బాహుబలి 1,బాహుబలి 2, RRR సినిమాలకు చీఫ్ అసోసియేట్ గా పని చేస్తూ ఇప్పుడు కెమెరామెన్ గా మారి రజాకార్ సినిమాకు గాను దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ కెమెరామెన్‌గా నిలిచారు.
నిజాం రాజుల నిరంకుశ పాలనను, రజాకర్ల దౌర్జన్యాల్ని మట్టు పెట్టి నిజాం రాజ్యాన్ని భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా కలిపారు అనే వీర గాథల్ని యాట సత్యనారాయణ దర్శకత్వంలో రజాకార్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇదే సినిమాకు డైరెక్టర్ కూడా అవార్డు అందుకున్నారు.
ఇక సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి ప్రస్తుతం బార్బరిక్, అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!