ఎలక్ట్రిక్ బస్సులు..మొదటి సౌదీ నగరంగా నిలిచిన తబుక్..!!
- May 07, 2025
తబుక్: పబ్లిక్ బస్ ట్రాన్సిట్ సిస్టమ్ కింద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మొట్టమొదటి సౌదీ నగరంగా తబుక్ నిలించింది. తబుక్ ప్రాంత ఎమిర్ ప్రిన్స్ ఫహద్ బిన్ సుల్తాన్ ఈ మేరకు బస్సులను మంగళవారం ప్రారంభించారు.
ఆధునిక బస్ నెట్వర్క్ నగరం అంతటా.. మొత్తం 136 కిలోమీటర్ల ఐదు ప్రధాన మార్గాలను కవర్ చేస్తుంది. 90 మంది శిక్షణ పొందిన సౌదీ డ్రైవర్లు, సిబ్బందితో 30 అధునాతన బస్సులను నడుపనున్నారు. మొత్తం 106 స్టేషన్లు కీలకమైన నివాస, వాణిజ్య, పరిపాలనా కేంద్రాలను కవర్ చేస్తాయి. సౌదీ విజన్ 2030 విస్తృత లక్ష్యాలలో భాగంగా ఈ రవాణా ప్రాజెక్టు ఒకటని ఎమిర్ ప్రిన్స్ అన్నారు.
ఈ ప్రాజెక్టును ప్రజా రవాణాలో "గుణాత్మక ముందడుగు" అని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్ అన్నారు. 2024లో 15 నగరాల్లో 104 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఇలాంటి బస్సు నెట్‌వర్క్‌లను ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. టబుక్ ప్రాజెక్ట్‌ను SAPTCO నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..