యూఏఈలో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు పొడిగింపు?

- May 08, 2025 , by Maagulf
యూఏఈలో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు పొడిగింపు?

యూఏఈ: యూఏఈలో ప్రైవేట్ రంగంలో పనిచేసే మహిళలు త్వరలో పొడిగించిన వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC)లో ఇటీవలి దీనిపై చర్చలు జరిగాయి. ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.  ఈ సమస్యను FNC సభ్యుడు డాక్టర్ అద్నాన్ అల్ హమ్మది లేవనెత్తారు. ప్రైవేట్ రంగంలో ఎమిరాటీ తల్లులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల్లో అసమానతల గురించి మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రి డాక్టర్ అబ్దుల్ రెహమాన్ అల్ అవార్‌ను ప్రశ్నించారు. ఒకే కంపెనీలో ఉన్న మహిళలకు కూడా వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు 45 -90 రోజుల మధ్య మారవచ్చని డాక్టర్ అల్ హమ్మది అభిప్రాయాలను హైలైట్ చేశారు.

FNC సెషన్‌లో డాక్టర్ అల్ హమ్మది మాట్లాడుతూ.. "ప్రైవేట్ రంగంలో పనిచేసే ఎమిరాటీ తల్లుల నుండి మాకు అభిప్రాయం వచ్చింది. వారు ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పటికీ, వారు పొందే వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మారుతూ ఉంటాయి." అని అన్నారు.  మరోవైపు మంత్రి అల్ అవార్ తన లిఖితపూర్వక ప్రతిస్పందనలో ప్రస్తుత చట్టపరమైన విషయాలను స్పష్టం చేశారు. ఫెడరల్ చట్టం ఒక మహిళా ఉద్యోగికి 60 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవును అందిస్తుందని, ఇందులో 45 రోజులు పూర్తి వేతనంతో.. 15 రోజులు సగం వేతనంతో ఉంటాయన్నారు.దాంతోపాటు ఆమోదించబడిన వైద్య నివేదిక ద్వారా డాక్యుమెంట్ చేయబడిన ఆరోగ్య కారణాల వల్ల ఉద్యోగి తిరిగి పనికి రాలేకపోతే, ఆమె మరో 45 రోజుల వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చని తెలిపారు.  "లేబర్ మార్కెట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ప్రస్తుత ఎజెండాలో దేశంలోని శ్రామిక మహిళలకు ప్రసూతి సెలవులను పొడిగించే అవకాశాన్ని అధ్యయనం చేస్తుంది." అని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com