సినిమా రివ్యూ: #Single (#సింగిల్)
- May 10, 2025
శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే ‘హ్యాష్ ట్యాగ్ సింగిల్’. కార్తీక్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రచార చిత్రాలు అట్రాక్టివ్‌గా డిజైన్ చేశారు. దాంతో అంచనాలు పెరిగాయ్. ప్రమోషన్లు కూడా బాగా నిర్వహించారు. కొన్ని వివాదాస్పదమైనప్పటికీ రిలీజ్‌కి ముందు అవన్నీ సినిమాపై పాజిటివ్ నోట్‌నే క్రియేట్ చేశాయ్. సో, సినిమా ఎలా వుందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
విజయ్ (శ్రీవిష్ణు) ఓ బ్యాంక్‌లో ఇన్సూరెన్స్ విభాగంలో పని చేస్తుంటాడు. అమ్మాయిల్ని పడేయడం తెలియక సతమతమవుతుంటాడు. సింగిల్ అనే హ్యాష్ ట్యాగ్‌తో మిగిలిపోవాలా అని టెన్షన్ పడతుంటాడు. అదే క్రమంలో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అరవింద్ (వెన్నెల కిషోర్) ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుంది. అది చూసి ఇంకా జలస్ ఫీలవుతుంటాడు విజయ్. ఎట్టకేలకు అరవింద్ పెళ్లి జరిగే క్రమంలోనే మెట్రోలో ఓ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయే పూర్వ (కేతిక శర్మ). తొలి చూపులోనే మనోడు మనసు పారేసుకుంటాడు. కానీ, పూర్వ, విజయ్ ప్రేమను అర్ధం చేసుకోదు. మరోవైపు విజయ్ అంటే పడి చచ్చిపోతుంది హరిణి (ఇవానా). ఎలాగైనా విజయ్ ప్రేమను దక్కించుకోవాలనుకుంటుంది. కానీ, విజయ్, పూర్వను ప్రేమిస్తాడు. మరి, తనను ప్రాణంగా ప్రేమించే హరిణి ప్రేమను విజయ్ దక్కించుకుంటాడా.? లేక, తాను ప్రేమించిన పూర్వనే దక్కించుకుంటాడా.? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది.? అనేది తెరపైనే చూడాలి.
నటీనటుల పనితీరు:
శ్రీ విష్ణుకిలాంటి పాత్ర కొత్తేమీ కాదు. చాలా క్యాజువల్‌గా నటించేసే పాత్రే ఇది. ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన శ్రీ విష్ణు.. విజయ్ పాత్రలో చాలా అలవోకగా నటించేశాడు ఎప్పటిలాగే. అంతేకాదు, తనదైన కామెడీ పంచ్ డైలాగులతో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సారి కేతిక శర్మకి మంచి స్కోపున్న పాత్ర దక్కింది. ఆ పాత్రలో సెటిల్డ్ పర్‌ఫామెన్స్ ఇచ్చింది. అలాగే కొత్తమ్మాయ్ ఇవానా కూడా మంచి స్కోపున్న పాత్రలోనే నటించింది. ఎమోషన్‌తో కూడిన చలాకీ అమ్మాయ్ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది ఇవానా. ఈ సినిమాకి మరో అస్సెట్ వెన్నెల కిషోర్ పాత్ర. హీరోకి ఫ్రెండ్‌గా దాదాపు ఫుల్ లెంగ్త్ రోల్‌లో తనదైన నవ్వులు పూయించాడు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ సీన్లు తెరపై.. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయ్. సెకండాఫ్‌లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర కాస్త ఎమోషనల్ టచ్‌తో ఆకట్టుకుంటుంది. సినిమా చివరిలో వచ్చిన యంగ్ జంట నార్నే నితిన్, రెబా మోనిక సర్‌ప్రైజింగ్ రోల్స్‌లో మెప్పించారు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేర నటించి మెప్పిస్తాయ్.
సాంకేతిక వర్గం పని తీరు:
నిజానికి ఈ తరహా ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఎన్నో చూశాం. కానీ, కథనం నడిపించిన తీరు, డైలాగులు, పాత్రల చిత్రీకరణలో తనదైన కొత్త దనం చూపించాడు దర్శకుడు కార్తీక్ రాజు. ఇది అచ్చంగా శ్రీవిష్ణు కోసం రాసుకున్న కథ. శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్‌ని దృస్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ సినిమాకి సీన్ టు సీన్ రాజుకున్నాడనిపిస్తుంది. అంతే కాదు, కథ పాతదే అయినా, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా వుంటుంది. ఎమోషన్ టచ్ వున్నప్పటికీ నవ్వుల బండి మాత్రం ఆగదు చివరి వరకూ, సెకండాఫ్‌లో కొంత మేర కా.. స్త సాగతీతలా అనిపించినప్పటికీ.. రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ నటుడి ఎంట్రీతో ఎమోషనల్ టచ్ ఇచ్చి కథలో వేగం పెంచే ప్రయత్నం చేశాడు. సీన్స్‌కి తగ్గట్లుగా విశాల్ చంద్ర శేఖర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పెద్దగా గుర్తుండవ్ కానీ, బీజీఎమ్ సూపర్. ఆర్ వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా వున్నాయ్. కొత్త స్క్రీన్‌ప్లేకి తగ్గట్లుగా టెక్నికల్ టీమ్ వర్క్ అంతా బాగుంది.
ప్లస్ పాయింట్స్:
శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్, కొత్తగా కథనం నడిపించిన తీరు, కామెడీ సన్నివేశాలు, ఊహించని విధంగా సరికొత్త క్లైమాక్స్..
మైనస్ పాయింట్స్:
పాత కథే, అక్కడక్కడా కొంత సాగతీతలా అనిపించిన ద్వితీయార్ధంలోని కొన్ని సన్నివేశాలు..
చివరిగా:
‘సింగిల్’.. నవ్వులే నవ్వుల్..!
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!