స్టార్ సింగర్-సునీత
- May 10, 2025
ఇండస్ట్రీలో సింగర్ సునీతకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందనడంలో సందేహం లేదు. సింగర్స్ అంతా వేరు.. సునీత వేరు అనేంతగా తన గానం, రూపుతో ఆకట్టుకున్నారామే. తనదైన యాటిట్యూడ్‌తో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సునీతకు స్టార్ హీరోయిన్ల రేంజ్‌లో క్రేజ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు.ఆ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న ఏకైక మహిళా సింగర్ ఈమే. ఏ మహిళా సింగర్‌కు కూడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈమే సొంతమనే చెప్పాలి.
అనుకోకుండానే సినిమా రంగంలోకి వచ్చిన ఆమె ఊహించలేనన్ని పురస్కారాలు.. అంతకుమించిన గుర్తింపు సాధించారు. ఆమె మన అభిమాన హీరోయిన్లకు గొంతక అయ్యారు. వాళ్ల సినిమాకు పాటగా మారారు. సౌందర్య నుంచి తమన్నా వరకు.. భాషతో సంబంధం లేకుండా ఆమె రాణిస్తున్నారు. గాయనిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆ తర్వాత డబ్బింగ్ మొదలుపెట్టి.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు సునీత. నేడు ప్లే బ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా ఆమె పుట్టినరోజు సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం...
ఉపద్రష్ట సునీత 1978, మే10న గుంటూరుకు చెందిన ఉపద్రష్ట నరసింహారావు, సుమతి దంపతులకు జన్మించారు. వీరిది అనాదిగా సంగీత నేపథ్యం కలిగిన కుటుంబం. తన కుటుంబంలోని వారంత సంగీత విద్యాంసులు, కళాకారులు కావడంతో చిన్నతంలోనే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అలా 13 ఏళ్లకే తన గురువుతో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆ తర్వాత 'పాడుతా తీయగా' తెలుగు సింగింగ్ షోలో పాల్గొని తన మధురమైన గాత్రంతో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను ఆకట్టుకున్నారు. ఈ షోతో వచ్చిన గుర్తింపుతో సినిమాలో పాడే అవకాశాన్ని అందుకున్నారు. అలా జేడీ చక్రవర్తి, మల్లీశ్వరి నటించిన 'గులాబి' సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో ఆమె పాడిన 'ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో' పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అప్పట్లో ఈ పాట ఓ సన్సేషన్. ఎంతోమంది సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ దెబ్బతో సునీత పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.
తొలి పాటతోనే స్టార్ సింగర్‌గా మారిన సునీత.. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గాయనీగా కొనసాగుతున్నారు. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ తన శ్రావ్యమైన గొంతుతో దశాబ్ధాలుగా అలరిస్తూ వస్తున్నారామె. వెండితెరపై ఆమె సోనాలి బెంద్రే, సౌందర్య, జ్యోతిక, ఛార్మి, నయనతార, తమన్నా, అనుష్క, జెనీలియా, శ్రియా సరన్, సదా, త్రిష, భూమిక, స్నేహ, మీరా జాస్మిన్, లైలా, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లకు తన గాత్రం (వాయిస్ ఓవర్) అందించారు. అలా డబ్బింగ్ ఆర్టిస్టుగా దాదాపు 500 వందల సినిమాలకు తన గొంతు ఇచ్చారట. ఇక కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గానూ అవకాశాలు వచ్చినా సున్నితంగా వాటిని తిరస్కరించారట. డబ్బింగ్ ఆర్టిస్టుగా సునీత సుమారు 9 నంది అవార్డులు గెలుచుకున్నారు. ఇక సింగర్‌గా ఎన్నో ఫిలిం ఫేర్, రాష్ట్ర అవార్డులతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకున్నారు.
ఇండస్ట్రీలో తనకంటూ పరిమితులు పెట్టుకుని గాయనీగా అగ్రస్థాయికి ఎదిగిన సునీత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు. 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సునీత వైవాహిక జీవితం మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 19 సంవత్సరాల వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకన్న సునీత ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. వారి పేర్లు ఆకాశ్(కొడుకు) శ్రేయ(కూతురు). అయితే పెళ్లయిన కొంతకాలానికి మనస్పర్థలతో భర్తతో విడాకులు తీసుకుని విడిపోయిన సునీత ఒంటరిగి జీవిస్తూ పిల్లలను పోషించుకుంది. 2021,జనవరి 9న మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్నారు.
తన విజయం వెనుక ఉన్న కుటుంబం పాత్ర గురించి చెబుతూ "ఈతరం తల్లిదండ్రుల ముందుచూపు మా పేరెంట్స్‌కు అప్పట్లోనే ఉంది. అయితే డాక్టర్, లేకుంటే ఇంజినీర్, లేదా చార్టెడ్ అకౌంటెంట్, కనీసం టీచర్ అవ్వాలనుకునే సమాజంలోనూ నేను రాణించగల రంగాన్ని గుర్తించి నన్ను ప్రోత్సహించారు. మా అమ్మ నన్ను గుంటూరు నుంచి విజయవాడ తీసుకెళ్లి సంగీతం నేర్పించారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మా నాన్నగారు ఒక్కక్షణం కూడా నన్ను విడిచి ఉండేవారు కాదు. నాన్నమ్మ, మేనత్త మొత్తం ఇలా అందరూ ఎంతో సహకరించేవారు" అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాటలతో ప్రేక్షకులను సునీత అలరించాలని కోరుకుంటున్నాం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!