కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సిరియా అధ్యక్షుడు సమావేశం..!!

- May 11, 2025 , by Maagulf
కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సిరియా అధ్యక్షుడు సమావేశం..!!

మనామా: బహ్రెయిన్ లో పర్యటిస్తున్న సిరియా అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా సఖిర్ ప్యాలెస్‌లో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో సమావేశం అయ్యారు.  అంతకుముందు సఖిర్ ప్యాలెస్‌కు చేరుకున్న అధ్యక్షుడు అల్-షారాకు స్వాగతం పలికారు.  సిరియా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో అధ్యక్షుడు అల్-షారా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.  రెండు దేశాల మధ్య లోతైన సంబంధాలను పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ప్రాంతీయంగా నెలకొన్న పరిణామాలపై సమీక్షించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com