గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- September 14, 2025
దుబాయ్: దుబాయ్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ విలేజ్ సీజన్ 30 తేదీలను ప్రకటించారు. అక్టోబర్ 15 నుండి వచ్చే ఏడాది మే 10వ తేది వరకు సీజన్ కొనసాగనుంది. గత సీజన్లో రికార్డు స్థాయిలో 10.5 మిలియన్ల సందర్శకులు సందర్శించారు.
ఈ ఏడాది అనేక ప్రత్యేకతలతో సీజన్ 30 వస్తుందని ప్రకటించారు. సరికొత్తగా అంతర్జాతీయ పెవిలియన్లు, ప్రపంచంలోని ప్రముఖ ఫుడ్, సాంస్కృతిక ప్రదర్శనలు, షాపింగ్, రైడ్లు మరియు గైరెక్ట్ ఎంటర్ టైన్ మెంట్ ను ఆస్వాదించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.
ఇక టిక్కెట్ ధరలను అక్టోబర్లో వెల్లడిస్తాయని గ్లోబల్ విలేజ్ వెబ్సైట్ లో తెలిపారు. గత సీజన్లో ఎంట్రస్ ఫీ Dh25 - Dh30 మధ్య ఉండేది. 3 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులతోపాటు ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులకు ప్రవేశం ఉచితమని తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







