కల్పవల్లి

- May 11, 2025 , by Maagulf
కల్పవల్లి

అందంగా  అల్లుకుపోయే సహజత్వం                                                                                    అలుపెరగని అంతేలేని అనురాగం 

అన్ని వేళలా స్పందించే సున్నిత సుగుణం 
అన్నింటిని సహించే ఔన్నత్యం 
అపురూపమైన వెలకట్టలేని కావ్యం....

ప్రేమకు ప్రతిరూపము మమతకు మణిహారం
కలతలే ఎరుగని మాధుర్యం 

తనలోకమంటు ఏది లేదు
తన కలలు తనని కన్నవారిని వదలి 
తనవారి కోసమే పరితపిస్తూ
తన సౌఖ్యం మరచి ప్రేమని అందిస్తూ 
తన కనుపాపే రక్షణ కవచంలా భావిస్తూ....

తన ఊపిరిని అందిస్తూ 
తన మదిలోని బాధలని మోస్తూ 
తన అడుగులో అడుగువేయమని చేయూత నిస్తూ
తన బిడ్డకి కష్టం రాకూడదని తలబడుతూ.....

తన పిల్లల మనస్తత్వాన్ని అంచనావేస్తూ 
తన సంతోషమైన వినోదమైన వారేనని 
తడబాటులని సరిదిద్దే అమృత తత్వం 
తాను పస్తులుండి పిల్లల‌ ఆకలి తీర్చేది ....

తనని మరిచే త్యాగాలకి నిలువెత్తు నిదర్శనం 
తన పంచప్రాణాలని నిరంతరం గమనించే 
 మూర్తీభవించిన వ్యక్తిత్వం వెలుగుని చూపే
దివ్యత్వం మహిలోనే సాటిలేరు మరెవ్వరూ ఆమెకి..
తానే కల్పవల్లి......

--యామిని కోళ్ళూరు ✍️

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com