మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ పై CME
- May 12, 2025
హైదరాబాద్: మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హై రిస్క్ ప్రెగ్నెన్సీపై సిఎంఈ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రసూతి నిపుణులు, పీడియాట్రిషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు మరియు ఆరోగ్యరంగ నిపుణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ ఒబ్జెట్రిషియన్ & గైనెకాలజిస్ట్ నిపుణురాలు డాక్టర్ బాలాంబ గారు మాట్లాడుతూ, "హై రిస్క్ గర్భధారణలు పెరిగిపోతున్న నేపధ్యంలో సమయానుకూలమైన శిక్షణ మరియు క్లినికల్ అవగాహన ఎంతో అవసరం. మెడికవర్ ఆసుపత్రులు ఈ రంగంలో ముందుండి మాతృ-శిశు ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు" అన్నారు.
FOGSI మాజీ అధ్యక్షురాలు డాక్టర్ శాంత కుమారి మాట్లాడుతూ, “ఈ రోజుల్లో మాతృ ఆరోగ్యం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి CME ల ద్వారా వైద్య నిపుణులు నైపుణ్యాలను మెరుగుపర్చుకొని సురక్షిత వైద్యం అందించగలుగుతారు" అన్నారు.
మెడికవర్ హాస్పిటల్స్ నెయోనటాలజీ మరియు పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే గారు మాట్లాడుతూ, "హై రిస్క్ ప్రెగ్నెన్సీ లో ఫలితాలు డెలివరీతో ఆగవు. శిశువుకు తగిన నెయోనటల్ కేర్ చాలా అవసరం. మా సమగ్ర విధానం ద్వారా తల్లి మరియు శిశువుకు ఉత్తమ చికిత్స అందించగలుగుతున్నాం” అన్నారు.
కన్సల్టెంట్ ఒబ్జెట్రిషియన్ & గైనెకాలజిస్ట్ డాక్టర్ మీనాక్షి మాట్లాడుతూ, “జెస్టేషనల్ డయబెటిస్, ప్రీ ఎక్లాంప్షియా, ప్రీటర్మ్ లేబర్ లాంటి సమస్యల పరిష్కారానికి ముందుగానే గుర్తించడం ముఖ్యం. ఈ CME ద్వారా తాజా మార్గదర్శకాలు మరియు వాస్తవ అనుభవాలను పంచుకోవటం జరిగింది” అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ రాగా రెడ్డి, డాక్టర్ సింధూరి వంటి ప్రముఖులు శాస్త్రీయ సెషన్లు, ప్యానెల్ డిస్కషన్ లు నిర్వహించారు. మోడరేటర్లుగా డాక్టర్ రాధికా, డాక్టర్ కృష్ణ కుమారి, డాక్టర్ సావిత రాథోడ్, డాక్టర్ సురేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ మాతృ-శిశు ఆరోగ్య సంరక్షణలో అత్యుత్తమ సేవలతో పాటు విద్యా కార్యక్రమాల ద్వారా వైద్యరంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేశారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్‌పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







