జమ్మూకశ్మీర్‌ ఎదురుకాల్పుల్లో లష్కరే ఉగ్రవాది హతం

- May 13, 2025 , by Maagulf
జమ్మూకశ్మీర్‌ ఎదురుకాల్పుల్లో లష్కరే ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లా మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలతో దద్దరిల్లింది. సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర ప్రతిస్పందన చోటు చేసుకుంది. లష్కరే తోయిబా అనే పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాద సంస్థకు చెందిన ఒక ఉగ్రవాది ఈ ఘటనలో హతమయ్యాడు. అతని వద్ద యుద్ధ సామగ్రి స్వాధీనం. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఇద్దరు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలోనే మిగిలి ఉండవచ్చన్న అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

స్థానిక పోలీసులకు వచ్చిన సమాచారాన్ని అనుసరించి, షోపియాన్‌లోని ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని గుర్తించారు. వెంటనే జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. గాలింపు చర్యల సమయంలో ఉగ్రవాదులు బలగాల కదలికను గమనించి అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డారు. భద్రతా బలగాల అనుమానాల ప్రకారం, ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు అదే ప్రాంతంలో ఉన్న అవకాశముంది. వారి కోసం డాగ్ స్క్వాడ్, డ్రోన్లు సహా ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో కూడిన శోధన ఆపరేషన్ కొనసాగుతోంది. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఉగ్రవాదులు తమకు ఆశ్రయం ఇచ్చే స్థానిక మద్దతుదారులనుంచి బయటపడేందుకు ప్రయత్నించవచ్చన్న నేపథ్యంలో, భద్రతా బలగాలు ప్రజలను సహకరించమని, అవసరమైనపుడు తమ ఇళ్లను ఖాళీ చేయమని సూచిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com