పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!

- May 13, 2025 , by Maagulf
పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!

యూఏఈ: పార్మికంగ్ విషయంలో తలెత్తిన వివాదం ముగ్గురి మహిళల ప్రాణాలను తీసింది. ఈ దుర్ఘటన రాస్ అల్ ఖైమాలో జరిగింది. మృతుల్లో 66 ఏళ్ల తల్లితోపాటు వారి ఇద్దరి కుమార్తెలు ఉన్నారు. నివాస ప్రాంతంలో కాల్పులు జరిగాయని తమకు సమాచారం అందగానే పెట్రోలింగ్ యూనిట్లను పంపినట్లు అల్ ఖైమా పోలీసులు తెలిపారు. ఐదు నిమిషాల్లోనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని వెంటనే అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. 

బాధితురాలి పెద్ద మహిళ కుమారుడు మహర్ సలేం వఫాయ్ ఈ భయానక సంఘటనలను వివరించాడు. అతని 66 ఏళ్ల తల్లి తన నలుగురు సోదరీమణులతో వాహనంలో ఉండగా, ఒక వ్యక్తితో పార్కింగ్ వివాదం హింసాత్మకంగా మారిందన్నాడు. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన నిందితుడు తుపాకీని తీసి మహిళలపై కాల్పులు జరిపాడని తెలిపాడ. ఈ దాడిలో ఒకమహిళ తప్పించుకోగా, మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, చట్టపరమైన చర్యల కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.  ఈ సంఘటన తుపాకులపై యూఏఈ కఠినమైన చట్టాలను చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తుందని మేధావులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com