CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!

- May 13, 2025 , by Maagulf
CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మంగళవారం 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈసారి 88.39 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు, ఇది గత సంవత్సరం కంటే 0.41 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ సంవత్సరం CBSE 12వ తరగతి పరీక్షల్లో 91 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇది అబ్బాయిల కంటే 5.94 శాతం ఎక్కువ.  

CBSE 10వ తరగతి,  12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు విజయవంతంగా నిర్వహించారు.  అయితే 10వ తరగతి పరీక్షలు మార్చి 18న ముగిశాయి. CBSE 12వ తరగతి పరీక్షలకు 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 14 లక్షలకు పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఈ ప్రాంతంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించింది. 99.60 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.  ఫలితాల్లో ప్రయాగ్‌రాజ్ అట్టడుగున ఉంది. ఇండియాలోని 7,842 కేంద్రాలు, విదేశాలలో 26 ప్రదేశాలలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షలు జరిగాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com