అల్ బర్షా అగ్నిప్రమాదం.. భవనాన్ని ఖాళీ చేసిన నివాసితులు..!!
- May 14, 2025
దుబాయ్: అల్ బర్షాలోని అల్ జరూని భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పిన తర్వాత, నివాసితులను రాత్రిపూట ఖాళీ చేయించడతో, అనేకమంది తమ స్నేహితుల ఇల్లో సేదతీరారు. భవనం మొదటి అంతస్తులో నివసించే ఫిలిప్పీన్స్ ప్రవాసియైన రాబ్,, తన నివాసం నుండి కొన్ని మీటర్ల దూరంలో నివసించే తన స్నేహితుడు రాత్రి పడుకునేందుకు ఆహ్వానించారని తెలిపారు.
ప్రభావిత ప్రమాదం భవనం మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ పార్కింగ్ స్థలం నుండి కొన్ని మీటర్ల దూరంలో, గత సంవత్సరం డిసెంబర్ 30న మంటలు చెలరేగిన నివాస భవనం నుండి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంది. "రాత్రి 8.40 గంటలకు మాకు పెద్ద పేలుడు శబ్దం వినిపించింది" అని రాబ్ చెప్పారు.
భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పెర్ల్ వ్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్ కావడం వల్లే మంటలు విస్తరించని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. పొగలు మూడవ అంతస్తు వరకు వ్యాపించాయని చెప్పారు. “రెస్టారెంట్ సిబ్బంది , కస్టమర్ల గురించి మేము ఆందోళన చెందుతున్నాము.అది భోజన సమయం. సాధారణంగా రెస్టారెంట్ ఆ సమయంలో కస్టమర్లతో ఫుల్ గా ఉంటుంది.” అని మరొక నివాసి తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!