మే 20 నుంచి ఖతార్ ఎకనామిక్ ఫోరం..!!
- May 19, 2025
దోహా: ఖతార్ ఎకనామిక్ ఫోరం 5వ ఎడిషన్ సమావేశాలు మే 20 నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2500మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. దోహాలో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం ఫోరమ్ "ది రోడ్ టు 2030: ట్రాన్స్ఫార్మింగ్ ది గ్లోబల్ ఎకానమీ" థీమ్ జరుగనుంది. ఖతార్ ఎకనామిక్ ఫోరం 2022, 2024 మధ్య ఖతార్ జిడిపికి QR177.5 మిలియన్లకు పైగా ప్రయోజనం కలిగిందని, తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించబడ్డాయని పేర్కొన్నారు.
ఖతార్ నేషనల్ విజన్ 2030ని ముందుకు తీసుకెళ్లడంలో.. దోహాను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఫోరమ్ ప్రముఖ పాత్రను పోషించనుందని మీడియా సిటీ ఖతార్ సీఈఓ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జాసిమ్ మొహమ్మద్ అల్ ఖోరి తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







