ఖోర్ ఫక్కన్‌లోని బీచ్‌లో స్విమ్మింగ్ సస్పెండ్..!!
- May 20, 2025
యూఏఈ: ఖోర్ ఫక్కన్‌లోని ప్రసిద్ధ అల్ జుబారా బీచ్‌లో ఆయిల్ స్పిల్ కారణంగా ఈత కొట్టడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖోర్ ఫక్కన్ మునిసిపాలిటీ ప్రకటించింది. సందర్శకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
2020లో షార్జాలోని ఖోర్ ఫక్కన్‌లోని రెండు బీచ్‌లలో ఆయిల్ స్పిల్ అదుపులోకి వచ్చింది. అల్ లులాయా, అల్ జుబారా బీచ్‌లలో తేలికపాటి చమురు తెట్టు ఉందని, ఇది పర్యావరణం.. సముద్ర జీవ వ్యవస్థకు విపత్తుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ చర్య కోసం EPAA పోలీసులు, మున్సిపల్ సంస్థలు, కోస్ట్ గార్డ్ కలిసి పనిచేసాయి.
2024లో జరిగిన మరో సంఘటనలో ఫుజైరాలోని స్నూపీ ద్వీపం సమీపంలోని బీచ్‌లో ఆయిల్ స్పిల్ జరిగింది. దీనికి ముందు, 2022లో ఫుజైరా, షార్జాలోని కల్బాలోని కొన్ని ప్రాంతాలను ఆయిల్ స్పిల్ ప్రభావితం చేసిన తర్వాత కొన్ని బీచ్‌లు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి.
ఆయిల్ స్పిల్ అంటే పర్యావరణంలోకి, ముఖ్యంగా సముద్ర పర్యావరణ వ్యవస్థలోకి ద్రవ పెట్రోలియం హైడ్రోకార్బన్ విడుదల కావడం అని నిపుణులు తెలిపారు. ఈ ద్రవాలు ముడి చమురు, గ్యాసోలిన్, డీజిల్ వంటి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇది బీచ్‌లోని ఇసుక ప్రాంతాలపై నల్లని గీతలను ఏర్పరుస్తుంది.అవి కనిపించిన వెంటనే సందర్శకులు నగరంలోని మునిసిపాలిటీ లేదా పర్యావరణ అధికారులకు తెలియజేయవచ్చు. తద్వారా వారు త్వరిత చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!