కువైట్‌లో తొలిసారిగా ఒక భారతీయ సైకియాట్రిస్ట్ సేవలు..!!
- May 20, 2025
కువైట్: కువైట్‌లో తొలిసారిగా ఒక భారతీయ సైకియాట్రిస్ట్.. సల్మియాలోని ఒక ప్రైవేట్ హెల్త్‌కేర్ సెంటర్లో బాధ్యతలు చేపట్టారు. ప్రముఖ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ నీతు మరియం చాకో కువైట్‌లోని ప్రైవేట్ రంగంలో చేరిన మొదటి భారతీయ సైక్రియాట్రిస్ట్ గా బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ నీతు మరియం చాకో కువైట్‌లోని సల్మియాలోని ఫౌజియా సుల్తాన్ హెల్త్‌కేర్ క్లినిక్‌లో స్పెషలిస్ట్ సైకియాట్రిస్ట్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
డాక్టర్ నీతు డిప్రెసివ్ డిజార్డర్స్, స్లీపింగ్ రుగ్మతలు, మానసిక రుగ్మతలలో విస్తృతమైన అనుభవం ఉన్న సైకియాట్రిస్ట్. ఆమె పిల్లల, టీనెజ్ మనోరోగచికిత్స, కౌన్సెలింగ్, స్మోకింగ్ విరమణ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఆమె భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థలలో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్‌గా పనిచేశారు. ఆమెకు స్కిజోఫ్రెనియా, ఆందోళన రుగ్మతలు, అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్స్ చికిత్సలో విస్తృత అనుభవం ఉందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







