ప్రభుత్వ సంస్థల ఆర్థిక ఉల్లంఘనలను బహిర్గతం చేసే విజిల్‌బ్లోయర్‌లకు రక్షణ పటిష్టం..!!

- May 21, 2025 , by Maagulf
ప్రభుత్వ సంస్థల ఆర్థిక ఉల్లంఘనలను బహిర్గతం చేసే విజిల్‌బ్లోయర్‌లకు రక్షణ పటిష్టం..!!

దుబాయ్: దుబాయ్ లోని విజిల్‌బ్లోయర్‌లు ఇప్పుడు ప్రభుత్వ కంపెనీలు చేసిన ఉల్లంఘనలపై సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు రక్షణ పొందుతారు.

ఈ మేరకు దుబాయ్ మొదటి డిప్యూటీ పాలకుడు, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, దుబాయ్ జ్యుడీషియల్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంగళవారం జారీ చేసిన కొత్త డిక్రీ చేశారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక లేదా పరిపాలనా ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు లేదా దర్యాప్తు సమయంలో దుబాయ్‌లోని ఫైనాన్షియల్ ఆడిట్ అథారిటీతో సహకరించినందుకు రక్షణ పొందుతారు. అటువంటి ఉల్లంఘనలకు సంబంధించిన దర్యాప్తు సమయంలో సాక్ష్యం అందించమని కోరిన ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. అదే సమయంలో దర్యాప్తు నిర్వహించే బాధ్యత కలిగిన దర్యాప్తు అధికారులు అటువంటి కేసులను డీల్ చేసే విధానాలకు సంబంధించిన అవసరమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. విజిల్‌బ్లోయర్‌లు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడానికి వారు గోప్యతను పూర్తిగా కాపాడుకోవాలి.

దుబాయ్ ఆర్థిక వ్యవస్థ, పర్యాటక శాఖ కూడా విజిల్‌బ్లోయర్ రక్షణ విధానాన్ని అమలు చేయడంతో, విజిల్‌బ్లోయర్‌ల రక్షణకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది.

తొలిసారిగా 2022లో దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో లేదా దాని నుండి పనిచేస్తున్న అన్ని DFSA-నియంత్రిత సంస్థలకు వర్తించే విజిల్ బ్లోయింగ్ కోసం నియంత్రణ విధానాన్ని ప్రారంభించింది. 2020 లో కోర్టు కేసుల్లో సాక్షులను రక్షించడంపై ముసాయిదా బిల్లును ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) ప్రతిపాదించి చర్చించింది. ఈ కార్యక్రమాన్ని ఉల్లంఘించి గోప్య సమాచారాన్ని లీక్ చేసే వారికి 100,000 దిర్హామ్ల వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని ఇది ప్రతిపాదించింది. అబుదాబిలో ఉల్లంఘనలను నివేదించడానికి 2022లో 'వాజిబ్' అనే అప్లికేషన్ ప్రారంభించారు. దీని ద్వారా వ్యక్తులు అబుదాబిలో ఆర్థిక, పరిపాలనా అవినీతిని గోప్యంగా నివేదించడానికి వీలు కల్పిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com